life style Evidence Request File

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల మొబైల్ వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలనీ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా కోరారు

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల మొబైల్ వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలనీ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వారి CSR నిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల సోమవారం లోక్ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారి విజ్ఞప్తి మేరకు BDL కంపెనీ మెదక్ ప్రజలకు క్యాన్సర్ తొలి దశ లోనే తెలుసుకునేందుకు స్క్రీనింగ్ పూర్తి మెషినరీ తో ఉన్న వాహనాన్ని CSR కింద సమకూర్చింది.
క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల మొబైల్ వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలనీ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా కోరారు

క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల మొబైల్ వాహన సేవలను మెదక్ ప్రజలు ఉపయోగించుకోవాలనీ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా కోరారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో  ప్రజల సౌకర్యార్థం  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)  వారి CSR నిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని  తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల సోమవారం లోక్ భవన్ లో జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారి  విజ్ఞప్తి మేరకు BDL కంపెనీ మెదక్ ప్రజలకు క్యాన్సర్ తొలి దశ లోనే తెలుసుకునేందుకు స్క్రీనింగ్ పూర్తి మెషినరీ తో ఉన్నవాహనాన్ని CSR కింద సమకూర్చింది. 

మొబైల్ స్క్రీనింగ్ వాహనం లో క్యాన్సర్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ కోసం ఉద్దేశించిన  సౌకర్యాలనుఎంపీ శ్రీ రఘునందన్ రావు గవర్నర్ కు వివరించారు.

 ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ....ప్రాథమిక దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఆసుపత్రి లో ఉండే  స్క్రీనింగ్ సౌకర్యాలు  ఈ వాహనం లో ఉన్నాయన్నారు.  క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చికిత్స ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చునని గవర్నర్ తెలిపారు.
మెదక్ ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని గవర్నర్ శ్రీ శివ ప్రసాద్ శుక్ల  కోరారు. క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల మొబైల్ వాహనం కోసం కృషి చేసిన మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు, వాహనాన్ని సమకూర్చిన BDL ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాట్లాడుతూ...

ప్రతీ జిల్లా కేంద్రం లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉండాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశయంలో ఈ వాహనం ముందే చేరడం  సంతోషంగా ఉందన్నారు.  కార్యక్రమం లో BDL అధికారులు పాల్గొన్నారు.